సర్పంచ్ పదవి వేలం పాటకు వచ్చింది. వేలం పాటలో రూ.27.50 లక్షలు పలికింది సర్పంచ్ పదవి. ఈ సంఘనత వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం పాట పాడారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/grama-panchayati.webp)
ఈ తరుణంలోనే రూ.27.50 లక్షలకు వేలం పాటలో సర్పంచ్ పదవిని భీమరాజు అనే వ్యక్తి దక్కించుకున్నారు. నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేందుకు వేలంపాట వేసినట్టు సమాచారం అందుతోంది. కానీ భీమరాజుకు ముగ్గురు పిల్లలు ఉండడంతో, ఎలక్షన్ రూల్ ప్రకారం అతనికి పదవి దక్కుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దింతో వేలం పాటలో రూ.27.50 లక్షలు పలికిన సర్పంచ్ పదవిపై అందరు ఆరా తీస్తున్నారు.