Journalist shankar: జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసిన గూండాల అరెస్ట్ అయ్యారు. గురువారం రాత్రి జర్నలిస్ట్ శంకర్ మీద విచక్షణారహితంగా దాడి చేసిన కవాడిగూడకు చెందిన ప్రవీణ్, ఎల్లారెడ్డి కాలనీకి మహేష్, ఎల్బీనగర్ హాస్టల్లో ఉంటున్న ఇద్దరు యువతులు శ్రీదుర్గ, హేమలతలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఇక పారిపోయిన మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
కాగా, ప్రముఖ జర్నలిస్టు శంకర్ పై దాడి జరిగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా జర్నలిస్టు శంకర్ పై అటాక్ చేశారు. మొత్తం 15 మంది దుండగులు… జర్నలిస్టు శంకర్ పై దాడి చేశారని కొంతమంది స్థానికులు చెబుతున్నారు. హైదరాబాదులోని ఎల్బీనగర్ లో జర్నలిస్టు శంకర్ పై దాడి జరిగినట్లు సమాచారం అందుతుంది. ఇక జర్నలిస్ట్ శంకర్ మీద దాడి జరిగిన తరుణంలో ప్రధాన విపక్ష పార్టీ brs స్పందించింది. జర్నలిస్ట్ శంకర్ మీద దాడి అన్యాయమని ఫైర్ అయింది.