కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని సీతక్కకు జర్నలిస్టుల ఫిర్యాదు !

-

మంత్రి సీతక్కకు వినతిపత్రం ఇచ్చారు జర్నలిస్టులు. కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని మంత్రి సీతక్కకు వినతిపత్రం ఇచ్చారు జర్నలిస్టులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయంపై కథనం ఇచ్చిన ఓ జర్నలిస్టును, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు బెదిరించి ఇతరులతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే యత్నం చేస్తున్నాడు.

Journalists complain to Sitakka that Congress leaders are threatening

కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాశా రనే కారణంగా మరో ఇద్దరు విలేకరులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారని.. తమపైన దాడులు ఆపా లని మంత్రి సీతక్కకు వినతిపత్రం ఇచ్చారు జర్నలిస్ట్ జేఏసీ నాయకులు. అయితే.. దీనిపై మంత్రి సీతక్క కూడా సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. జర్నిలిస్టులకు తమ ప్రభుత్వం ఎప్పు డూ అండగా ఉంటుందని తెలిపారు మంత్రి సీతక్క. జర్నిలిస్టులు ఎవరూ కూడా ఆందోళన చెంద వద్దని కోరారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version