కేసీఆర్ నీకు సిగ్గు ఉందా …రాజ్యసభ అభ్యర్థులపై ఎంపికపై కేఏ పాల్ ఫైర్

-

టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించడంపై కేఏ పాల్‌ సీరియస్‌ అయ్యారు. గవర్నమెంట్ ట్యాక్స్ ఏగ్గొట్టిన గ్రానైట్ పరిశ్రమల అధినేత వద్దిరాజు రవిచంద్రకు రాజ్య సభ సిటా… సిగ్గు ఉందా కెసిఆర్ అంటూ ఫైర్‌అయ్యారు. వీళ్ళకి సిట్ ఇవ్వడం కంటే డాన్ దావుద్ ఇబ్రహీంకు ఇవ్వడం బెటర్అంటూ నిప్పులు చెరిగారు.

టీఆర్ఎస్ పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావుకు రాజ్య సభ సీటు ఎందుకు ఇచ్చారని మండిపడ్డారు. మోదీ గవర్నమెంట్ పై నేను ఒక్కడినే పోరాడుతున్నా.. రాహుల్ గాంధీ పడుకొంటున్నారని విమర్శించారు.

దేవుడు నన్ను పుట్టించింది ప్రజల కోసమని…..అంబేద్కర్., పూలె ఆశయాలను నిలబెట్టడానికి..నాతో నడవండని కోరారు. ముగ్గురు వ్యాపార వేత్తలను రాజ్య సభకు పంపిస్తున్నారు… ఉద్యమకారులను పట్టించుకోకుండా బడబాబులకు సీట్లు అమ్ముకున్నారని ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి తమ సొంత ప్రయోజనాలు చూసుకున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version