నేను నిజమైన హిందువును… హిందువుగానే చనిపోతాను – కేఏ పాల్

-

నేను నిజమైన హిందువును… హిందువుగానే చనిపోతానంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఏసుక్రీస్తు ను ఫాలో అవుతానని..కోర్టులు మొట్టికాయలు పెట్టినా కేసీఆర్ మారడం లేదని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ 600 కోట్లు ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారు….ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అమలుపరుస్తున్నాడని మండిపడ్డారు.

తన కూతురు కవిత అరెస్ట్ ను తప్పించకపోవడానికేనా ! కేసీఆర్ ఆర్ఎస్ఎస్ నేతలతో టచ్ లో ఉంటున్నాడు….కేసీఆర్ బిజెపి బీ టీమ్ అని మరోసారి నిరూపించుకుంటున్నాడు. అందుకే కేసీఆర్ , కేటీఆర్ అరెస్ట్ కావడం లేదన్నారు కెఎ పాల్. కేసీఆర్ తాను సెక్యులర్ అని చెప్పుకుంటూ చర్చిలకు, మసీదులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు…రాష్ట్ర ఖజానాలో డబ్బుల లేవని ప్రభుత్వ భూములు అమ్మి వచ్చిన నిధులను ఒకటి రెండు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నాడని నిప్పులు చెరిగారు.

కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తాను..రాష్ట్రంలో సెక్యులర్ ప్రజలు ఈ విషయం పై కేసీఆర్ ను ప్రశ్నించాలన్నారు. డబ్బుల కోసం కమ్యూనిస్టులు కేసీఆర్ దగ్గరకే కాదు ఎక్కడికైనా వెళతారు…ఏప్రిల్ 14వ తేదీన తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ఒప్పుకున్నాడు కాబట్టి రేపు తెలంగాణ ప్రజలు కలెక్టరేట్ లు ముట్టడించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version