రేవంత్ రెడ్డి…ఓ సద్దాం హుస్సేన్ – కేఏ పాల్‌ సంచలనం

-

రేవంత్ రెడ్డి…ఓ సద్దాం హుస్సేన్ అంటూ కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడని ఆగ్రహించారు కేఏ పాల్. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలో ఎప్పుడూ గొడవలే అంటూ చురకలు అంటించారు. ఒకరోజు రైతులతో గొడవ, బేడీలు వేయిస్తాడని… ఇంకో రోజు సర్పంచులు వస్తే వారిని అరెస్టు చేయిస్తాడని ఫైర్ అయ్యారు కేఏ పాల్.

ka paul

నిరుద్యోగులు ఉద్యోగాలు ఏవి అని అడిగితే అరెస్టు చేయిస్తాడని… నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటే వారి మీద లాఠీ ఛార్జ్ చేయిస్తాడని చురకలు అంటించారు కేఏ పాల్. రేవంత్ రెడ్డి నన్ను చంపాలని చూశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్…RR టాక్స్ వసూలు చేస్తున్నారని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయన్నారు. మీడియా సమావేశాలు పెట్టి ప్రశ్నిస్తుంటే 58 సార్లు నా ప్రెస్ మీట్లు ఆపాడు, నన్ను చంపాలని చూశాడు కానీ చంపగలిగాడా? అంటూ నిలదీశారు కేఏ పాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version