జగన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆశీర్వదించారు తల్లి విజయమ్మ. కడప జిల్లా ఇడుపులపాయలోని చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా కొడుకుకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు తల్లి విజయమ్మ.
ఈ సందర్భంగా జగన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆశీర్వదించారు తల్లి విజయమ్మ. జగన్ ను ఆప్యాయంగా పలకరించిన విజయమ్మ.. అమ్మ ప్రేమను చాటుకున్నారు. కాగా, నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఈ నెల 25వ తేదీ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నెల 26వ తేదీ పులివెందులలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ నెల 27 న ఉదయం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.