ఈనెల 12న కరీంనగర్ లో కదన భేరీ సభ : కేటీఆర్

-

లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం పై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేయాలని భారాస శ్రేణులకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  పిలుపునిచ్చారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం భారాస నేతలతో ముస్తాబాద్లో ఆయన సమావేశమయ్యారు.

సిరిసిల్ల లోనూ ఎల్ఆర్ఎస్ పీ నిరసన తెలపాలన్నారు. భారస ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. డిసెంబర్ 19న అన్ని హామీలు నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి  మాట తప్పారని చెప్పారు. కరీంనగర్కు బండి సంజయ్ చేసిందేమీ లేదని, మతం, అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకోరాలని భారతీయ జనతా పార్టీ చూస్తోందని విమర్శలు గుప్పించారు. ఈ నెల 12న కరీంనగర్ లో ‘కదన భేరి’ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version