కాలేశ్వరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి మంచి పని చేసిందని కొనియాడారు చంద్రబాబు నాయుడు. కాలేశ్వరం ప్రాజెక్టు.. కట్టడం వల్ల తెలంగాణకు నీళ్లు వస్తున్నాయని వివరించారు. తానెప్పుడూ కాలేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. ఒక కరువు ప్రాంతానికి నీళ్లు వెళ్తాయంటే ఎవరైనా అడ్డుపడతారా ? అంటూ నిలదీశారు.

అనవసరంగా సముద్రంలో కలిసే నీళ్లను తెలంగాణకు తీసుకొచ్చుకుంటున్నారు.. అది గొప్ప ఆలోచన అని వెల్లడించారు. అలా ఇంకా ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు అన్నారు. కానీ అనవసరంగా నీటిని సముద్రంలో కలపకుండా చూసుకోవాలన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం కాలేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి… తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో… కాలేశ్వరం ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు అనుకూలంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది.