ఈ నెల 25న ముంబైకి కల్వకుంట్ల కవిత వెళ్లనున్నారు. “ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ – 2023” లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవితక్క..ఈ మేరకు ముంబైలో పర్యటించనున్నారు. ఒక ప్రముఖ ఛానల్ “వీడియోస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2023” పేరిట నిర్వహించునున్న సదస్సులో “2024 ఎన్నికలు – విపక్షాల వ్యూహం” అనే అంశంపై జరిగే చర్చా వేదికలో ఆమె పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు.
చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితక్క తో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ ఛడ్డ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ పాల్గొంటారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కవితక్క వివరించనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి తెలియజేయనున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎండగట్టనున్నారు.