ఈడీ నోటీసులపై స్పందించిన కవిత.. 9న నన్ను విచారణకు రమ్మన్నారని తెలిపారు. కానీ 11న వస్తానని చెప్పాను, ఈడీ విచారణను ఎదుర్కొంటా, ఈడీ అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తా, నాకు భయమెందుకు? నేనేం తప్పు చేయలేదు, విపక్షాల మాట కూడా వినాలన్నారు కవిత. నాతోపాటు ఎవర్ని విచారించినా ఇబ్బంది లేదని వివరించారు ఎమ్మెల్సీ కవిత.
దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెబుతోంది.. దర్యాప్తు సంస్థలు మహిళల్ని విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం.. ఈడీ ఎందుకింత హడావిడిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు.. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరు? అని నిలదీశారు కవిత.
కావాలంటే నిందితుల్ని ఇంటికి తీసుకొచ్చి విచారించమని కోరా.. కానీ ఈడీ మా విజ్ఞప్తిని పట్టించుకోలేదు.. ఈడీ దర్యాప్తుకు వంద శాతం సహకరిస్తాం.. తెలంగాణ నేతల్ని వేధించడం కేంద్రానికి అలవాటైపోయింది.. నిందితులతో కలిపి ప్రశ్నించాలనుకుంటే నన్ను వీడియో కాన్ఫరెన్స్లో విచారించండన్నారు కవిత.