సీఎం కేసిఆర్ కు పోటీగా పిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి సీఎం కేసిఆర్ కు పోటీగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. తదుపరి జాబితాలో అధికారికంగా ప్రకటన రానుంది. కామారెడ్డి, గజ్వెల్ నుంచి సీఎం కేసిఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే.. ఇప్పటికే గజ్వెల్ నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు.ఇక ఇప్పుడు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి సీఎం కేసిఆర్ కు పోటీగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బరిలో ఉండనున్నట్లు సమాచారం అందుతోంది.
ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ రెండవ జాబితాలో చోటు దక్కని పలువురు అసంతృప్తిగా ఉన్నారు. బోథ్ టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే బాపురావు స్వతంత్రంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్, ఇబ్రహీంపట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రామ్ రెడ్డి, మహేశ్వరం టికెట్ రాకపోవడంతో నరసింహారెడ్డి, హుస్నాబాద్ లో ప్రవీణ్ రెడ్డి, మునుగోడులో ఇండిపెండెంట్ ఆ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు చలమల కృష్ణారెడ్డి.