SI, కానిస్టేబుల్‌, ఆపరేటర్ మృత దేహాలు లభ్యం..అక్రమ సంబంధమే ప్రాణాలు తీసిందా !

-

వివాహేతర సంబంధాలు..ముగ్గురి ప్రాణాలు తీసినట్లు చెబుతున్నారు. SI, కానిస్టేబుల్‌, ఆపరేటర్ మృత దేహాలు లభ్యం అయ్యాయి. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో భిక్కనూరు ఎస్సై సాయి కుమార్ శవం కూడా లభ్యం అయింది. నిన్న రాత్రి దాటిన తరువాత కానిస్టేబుల్ శృతి, మరో యువకుడు నిఖిల్ శవం లభ్యం కావడం జరిగింది. భీక్కునూర్ ఎస్సై సాయికుమార్,బిబి పెట్ కానిస్టేబుల్ శృతి..సొసైటీ ఆపరేటర్ నిఖిల్ మృత దేహాలు లభ్యం అయ్యాయి.

crime

కానిస్టేబుల్ శృతితో వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్యలు కొనసాగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ ఎస్సైగా సాయి కుమార్ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అదే పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న శృతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం అందుతోంది. అప్పటికే ఎస్సైకి వివాహం జరిగిందట. అంతేకాదు ఇద్దరు పిల్లలు ఉన్నారట..అటు అప్పటికే శృతికి పెళ్ళై విడాకులు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎస్సై బదిలీ పై బిక్కునూర్ రావడంతో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో శృతికి రిలేషన్ పెట్టుకుందని అంటున్నారు. ఈ విషయం ఎస్సైకి తెలిసిందట. ఈ తరుణంలోనే… మూడు మరణాలు జరిగినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news