మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీజేపీ కౌంటర్..!

-

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యాటనలో ఆంతర్యమేంటో.. కులగణనపై ఆదేశాలు, జీవోలు వచ్చిన తర్వాత మేధావులతో సమావేశాలెందుకో అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అయితే పక్క రాష్ట్రంలో ఎన్నికలున్నాయని కొత్త డ్రామాలు చేస్తున్నారు. తెలంగాణ బీసీల మీద ప్రేముంటే ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ప్రేముందా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు.. బీసీలకు ఎన్ని కార్పోరేషన్ ఛైర్మన్ బాధ్యతలు ఇచ్చారు అని ప్రశ్నించారు. అలాగే బీసీలకు వెన్నుపోటు పొడిచేలా కులగణన సర్వే ఉంది.

గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది.. ఆ సర్వే వివరాలు రేవంత్ రెడ్డి ఎందుకు బయటపెట్టడం లేదు. సర్వేలో బ్యాంకు వ్యక్తిగత వివరాలు ఎందుకు అడుగుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగత వివరాలు అడగవద్దు అని అన్నారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కు బీజేపీ తరపున కౌంటర్ ఇచ్చారు. మంత్రి పొన్నం కిషన్ రెడ్డి డీఎన్ఏ తెలంగాణ కాదన్నారు. అయితే రేవంత్ రెడ్డి డీఎన్ఏ టీడీపీ నా ? తెలంగాణనా ?ఆంధ్రానా.. డీఎన్ఏ గురించి మాట్లాడాల్సి వస్తే సోనియా, రాహుల్ గాంధీ డీఎన్ఏల గురించి మాట్లాడాల్సి వస్తుంది అని కాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version