గాంధీ భవన్ కు చేరిన పఠాన్ చేరువు పంచాయతీ..!

-

పఠాన్ చేరువు కాంగ్రెస్ లీడర్లలో కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ సమావేశాలకు కూడా ఏవరు హాజరు కావడం లేదు. ఇక తాజాగా ఈ పఠాన్ చేరువు పంచాయతీ గాంధీ భవన్ కి చేరింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు పఠాన్ చేరు ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్.

ఈ క్రమంలో గత BRS హయాంలో కేసులైనా కాంగ్రెస్ జెండా పట్టుకుని నిలిచిన వ్యక్తులం మేము అని కాటా శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాత్రికి రాత్రి తన మనుషులకు పోస్టింగ్ లు ఇప్పించుకుంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికే తిరిగి పోస్టింగ్ లు ఇప్పించాడు గూడెం. మేము BRS హయములో కేసులు ఎదుర్కొన్నాం. కాంగ్రెస్ పార్టీ హయంలోనూ మళ్లీ కేసులను ఎదుర్కోవాలా అని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్ పార్టీ ని డ్యామేజ్ చేయడానికే గూడెం BRS నుండి వచ్చాడు అని అన్నారు కాటా శ్రీను.

Read more RELATED
Recommended to you

Exit mobile version