మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం అన్నారు కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాను…. నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను… దేనికీ భయపడను అని తెలిపారు. కేసీఆర్ ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహించారు.
మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం… మేము తప్పు చేయలేదు… భయపడే ప్రసక్తే లేదని తెల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని తెలిపారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని…. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని చురకలు అంటించారు.
పేరు మర్చిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా కేసులు పెడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహించారు. ప్రభుత్వానికి ఎందుకింత భయం ? బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని సెటైర్లు పేల్చారు. మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వలేదని నిలదీశారు.
Live: Addressing BRS family in Nizamabad
https://t.co/YG9nmNcXN3— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 29, 2024