పురోగతిలో ఫోన్ టాపింగ్ విచారణ : డీజీపీ జితేందర్

-

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో విచారణ  కొనసాగుతోందని తెలంగాణ డీజీపీ జితేందర్  స్పష్టం చేశారు. కేసులో ఇతర దర్యాప్తు సంస్థల సహకారం అవసరమవ్వడంతో కేసు విచారణ ప్రక్రియలో కొంత జాప్యం నెలకొందన్నారు. విచారణను వేగవంతం చేసే దిశగా ఈ కేసులో విదేశాల్లో ఉన్న నిందితులను రప్పించేందుకు సీబీఐకి లేఖ రాశామని తెలిపారు. అమెరికా నుంచి ఇండియాకు వారిని రప్పించాలంటే ఇంటర్నేషనల్ ప్రాసెస్ జరుగుతుందని, ఇప్పటికే ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటున్నామని వెల్లడించారు. రాజకీయ నాయకులకు నోటీసులు అవసరం మేరకు జారీ అవుతాయని, ఇప్పటికే కొందరిని విచారించిన సంగతి తెలిసిందేనన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఇప్పటికే, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణిత్ రావులను అరెస్టు చేశారు. కేసు నమోదు విషయమై తెలుసుకున్న ఎస్ఐబీ
మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ చానల్ అధినేత శ్రవణ్ రావులు అమెరికా వెళ్లిపోయారు. కేసు పురోగతికి వారిద్దరు కీలకం కావడంతో వారిని ఇండియా రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తిప్పలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news