Kavitha: తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన కవిత

-

తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా MLC కవిత మాట్లాడారు. బతుకమ్మను మాయం చేసి కాంగ్రెస్ గుర్తు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహం పెట్టారు…టీజీ అని ఉద్యమంలో పచ్చబొట్టు కొట్టుకున్నారు అని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. టీజీని గుర్తించిన రేవంత్ ఉద్యమకారులంతా కలిసి తయారు చేసుకున్న విగ్రహం ఎందుకు మార్చారని నిలదీశారు.

kavitha dedicated to the Telangana thalli

ప్రపంచంలో అందరూ పూలతో దేవుని పూజిస్తే తెలంగాణలో మాత్రమే పూలను పూజిస్తామన్నారు. యూనిక్ ఐడెంటిటీ గా ఉన్న బతుకమ్మను మాయం చేశారు..బతుకమ్మ నీ మాయం చేసి కాంగ్రెస్ గుర్తు పెట్టారు…దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఫైర్ అయ్యారు. మహిళలకు విగ్రహాలు… పురుషులకు వరాలు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. బీద తల్లిని పెట్టారు… తెలంగాణ మహిళలు ఎదగటం ఇష్టం లేదా? తల్లి గొప్పగా ఉండాలి… కానీ మీరు కాంగ్రెస్ తల్లి నీ పెట్టుకున్నారని విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version