దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తాజాగా హస్తినలోని రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించే అవకాశం ఉంది.
మరోవైపు ఇటీవలేమద్యం కుంభకోణంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కవిత కస్టడీ కాలపరిమితి శుక్రవారంతో ముగియడంతో తిహాడ్ జైలు నుంచి ఆమెను వీడియో కాన్ఫరేెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాదులు చేసిన వాదనలుతో ఏకీభవించిన కోర్టు ఆమె కస్టడీని పొడిగించింది.