మైనంపల్లి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

-

మైనంపల్లి వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనంపల్లి విషయంలో పార్టీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. పార్టీ నిర్ణయం కు నేను అయిన… ఎవరు అయిన కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు కవిత. మళ్లీ అధికారంలోకి వచ్చేది BRS పార్టీనేని చెప్పుకొచ్చారు కవిత. గెలిచే వారికి అవకాశాలు ఇచ్చారని పేర్కొన్నారు కవిత.

మిగిలిన వాళ్ళకి పార్టీ ఇతర రూపంలో ఛాన్స్ ఇస్తుందని పేర్కొన్నారు. ఖానాపూర్ అభ్యర్థి కులం విషయంలో ఎటువంటి ఇబ్బందీ లేదని చెప్పారు కవిత. మహిళ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఏళ్లుగా ఏమి చేసింది ? రేవంత్ రెడ్డి ఎప్పుడు అయిన మోడీ ని విమర్శించారా ? అని ప్రశ్నించారు. మహిళ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ ,బిజెపి పార్టీలకు చిత్తశుద్ధి లేదని ఆగ్రహించారు. మళ్ళీ ఈ ఏడాది డిసెంబర్ లో మహిళ రిజ ర్వేషన్ల బిల్లు కోసం జంతర్ మంతార్ లో ధర్నా చేస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version