పార్టీని వీడి దొంగల్లా కలిసెటోళ్ల గురించి బాధలేదు..తెలంగాణ సాధించిన మనకు గిదో లెక్కనా.? అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అధినేత కేసీఆర్ భరోసా నింపారు. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప..నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరు.. స్పష్టం చేసిన కేసీఆర్… నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే అని వెల్లడించారు.
మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తది.. రెట్టించిన ఉత్సాహం తో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం అంటూ కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేసారు. ఇంకా నెరవేరని ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో నెరవేర్చే సత్తా, డెప్త్ మనకే ఉన్నదన్నారు కేసీఆర్.
ఇక శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ నేతలు, సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతును కూడగట్టుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ కేవలం 39 సీట్లను సాధించి ప్రతిపక్షంలో వెళ్లింది. అదేవిధంగా అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుని 64 సీట్లలో విజయకేతనం ఎగురవేసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.