తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం అసెంబ్లీ ఈనెల 27కి వాయిదా వేశారు. తదనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు తొలిసారిగా చేరుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్ర బడ్జెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది. భట్టి విక్రమార్క బడ్జెట్ ను నొక్కి చెప్పడం తప్ప ఏమీ లేదు. రాష్ట్రం మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు కేసీఆర్.
బడ్జెట్ లో కొత్తేమీ లేదు. ఏ సంక్షేమ పథకం ఇందులో లేదు. ఒత్తి ఒత్తి పలకడం తప్ప ఇందులో ఏమి కనిపించలేదు. ఆరు మాసాలు సమయం ఇవ్వాలని నేను ఇన్నాళ్లు అసెంబ్లీకి రాలేదు. పాలసి ఫార్ములా లేదు. అంత గ్యాస్ తప్ప ఏమి లేదన్నారు. ట్రాష్ ప్రసంగం లాగానే ఉందని తెలిపారు కేసీఆర్.