ఆసరా పెన్షన్ లపై కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసరా పింఛన్ నిబంధనలను సులభతరం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే వెంటనే అతని భార్యకు ఆసరా పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి మరియు పట్టణాలలో బిల్ కలెక్టర్ కు చనిపోయిన వ్యక్తి భార్య ఆధార్ కార్డు మరియు మృతుడి డెత్ సర్టిఫికెట్ సమర్పించాలని సూచనలు చేసింది. ఆ తర్వాత లబ్ధిదారుడి భార్యకు లేదా భర్తకు ఆ పెన్షన్ అమలు చేసేలా చూడాలని తెలిపింది.