జగన్‌ కు బిగ్‌ షాక్‌..KRMBకి కేసీఆర్‌ ప్రభుత్వం ఫిర్యాదు

-

ఏపీ ప్రభుత్వం పై కేఆర్ ఎంబీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు 2 లేఖలు రాశారు ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ మురళీధర్. ప్రకాశం బ్యారేజీ దిగువన 2 ఆనకట్టల నిర్మాణ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తి చేసింది కేసీఆర్‌ సర్కార్‌. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టరాదన్న రాష్ట్ర ప్రభుత్వం… 2 కొత్త బ్యారేజీల పనులు చేపట్టకుండా ఏపీని నిరోధించాలని కోరింది.

కృష్ణా జలాలపై ఆధారపడి పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌ల ప్రతిపాదనపై మరో లేఖ రాశారు ఇఎన్సీ మురళీధర్. జలవిధానం మేరకు తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం… తాగునీటి అవసరాలు కాదని ఇతరత్రాలకు తరలింపు సరికాదని పేర్కొంది. పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌, విద్యుదుత్పత్తికి నీటి తరలింపు సరికాదన్న రాష్ట్ర ప్రభుత్వం.. అనుమతి లేని పంప్డ్‌ స్టోరేజ్ స్కీమ్‌లను పరిశీలించాలని కోరింది. సీడబ్ల్యూసీ, బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేనివి పరిశీలనకు రావాలని వినతి అందించింది కేసీఆర్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version