పోలి పాడ్యమి నాడు ఏం చేయాలి..? ఈసారి ఎప్పుడు వచ్చిందంటే..?

-

ప్రతి సంవత్సరం కార్తీకమాసం ముగిసిన తర్వాత వచ్చే పాడ్యమి నాడు పోలి పాడ్యమిని జరుపుకుంటాము. కార్తీక మాసం ఇక కొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో నోములు, పూజలు చేశారు కార్తీక పౌర్ణమి తర్వాత నెలలో చివరగా చేసేది పోలి పాడ్యమి. కార్తీక అమావాస్య తర్వాత వచ్చే రోజున పోలి పాడ్యమిని చేసుకుంటాము. డిసెంబర్ ఒకటిన కార్తీకమాసం ముగుస్తుంది.

మరుసటి రోజు పోలి పాడ్యమిని జరపాలి. ఆ రోజు నుంచి మార్గశిర మాసం మొదలవుతుంది. పోలి పాడ్యమిని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. తెల్లవారుజామున మహిళలు నదులు, చెరువుల్లో దీపాలని వదులుకుంటారు. దీపదానం చేస్తే మంచిది. పోలి పాడ్యమినాడు 30 వత్తులతో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తే మంచిదట. అరటి దొన్నెలలో దీపాలని వెలిగించి నీటిలో వదులుకుంటారు.

మూడుసార్లు నీటిని తోసి నమస్కరిస్తారు. పోలి పాడ్యమి నాడు 30 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఇలా ఆ దీపాలను నీటిలో వదిలితే ఆ నెల అంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది. బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయంపాకాన్ని దానం చేస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తెలుగు వాళ్ళు పోలిని, దీపాన్ని కూడా మహాలక్ష్మి రూపంగా భావిస్తారు. కనుక పోలి దీపాలని అమావాస్య నాడు కాకుండా మర్నాడు పాడ్యమినాడు వెలిగిస్తారు. దీనిని పోలి పాడ్యమి అని అంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version