శాసనసభ ఆమోదం లేకుండా రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు : భట్టి

-

అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా ఇవాళ పద్దుపై ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధామిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఏనాడు నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదని అన్నారు. భారీగా బడ్జెట్‌ పెట్టినప్పటికీ నిధులు పూర్తిగా ఖర్చు చేయలేదని ఆరోపించారు. 2016-17లో రూ.8 వేల కోట్లు.. 2018-19లో 40 వేల కోట్లు.. 2021-22లో రూ.48 వేల కోట్లు.. 2022-23 లో రూ.52 వేల కోట్లకు పైగా.. 2023-24లో రూ.58,571 కోట్లు ఖర్చు చేయలేదని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకే 30 ఏళ్ల కాలానికి అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

“శాసనసభ ఆమోదం లేకుండా రూ.2.30 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కాగ్‌ వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొత్తం రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేసింది. రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్‌ ఏమి నిర్మించింది? రూ.16.70 లక్షల కోట్లతో నాగార్జునసాగర్‌ నిర్మించారా, ఎస్‌ఆర్‌ఎస్పీ నిర్మించారా? రూ.16.70 లక్షల కోట్లతో ఓఆర్‌ఆర్‌ నిర్మించారా?, ఎయిర్‌పోర్టు నిర్మించారా?” అంటూ గత కేసీఆర్ ప్రభుత్వాన్ని భట్టి విక్రమార్క నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news