ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే పాపులర్ టీమ్ ఆర్సీబీ (Royal Challengers Bengaluru) వివాదానికి తెర లేపింది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్సీ మార్పు జరిగిన తీరును ఎగతాళి చేస్తూ ఆర్సీబీ ఓ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఆర్సీబీకి చెందిన ‘మిస్టర్ నాగ్స్’ ముంబయి ఇండియన్స్‌ను ట్రోల్ చేస్తూ.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్‌తో మాట్లాడుతున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఇక ఈ వీడియోలో మిస్టర్ నాగ్స్… రజత్ పటీదార్ తో మాట్లాడుతూ.. ‘ మొత్తానికి నువ్వు కెప్టెన్ అయ్యావు. ఆర్సీబీ గత సారథులు విరాట్, డుప్లెసిస్ నీకు అభినందనలు తెలిపారు. మిగతా ఐపీఎల్ టీమ్‌లు కూడా కెప్టెన్సీ మార్పు సమయంలో ఇలాగే సాదర స్వాగతం పలికాయని అనుకుంటున్నావా?’ అని అడిగాడు. దానికి పటీదార్ సమాధానమిస్తూ తనకు ఆ విషయాలేం తెలియవని చెప్పాడు. నిజంగా తెలియకపోతే ఎందుకు నవ్వుతున్నావ్ రజత్ అంటూ ‘MI’ టీమ్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ వివాదానికి తెర లేపాడు మిస్టర్ నాగ్స్.