BREAKING : నల్లగొండ జిల్లాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ

-

BREAKING : తెలంగాణ మొట్ట మొదటి సీఎం కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత.. మళ్లీ తొలిసారిగా కేసీఆర్ ప్రజల్లోకి రానున్నారు. నల్లగొండ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది.

KCR

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏదో ఒక నియోజక వర్గంలో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందట. ఈ నెల మూడో వారంలో కేసీఆర్ సభ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. నల్లగొండ జిల్లా నుండే KRMB ఇష్యూ పై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

ఇక అటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కృష్ణ బేసిన్ లో నీటి కేటాయింపులు, గత ప్రభుత్వ వాదనలు, కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల వివరాలను వెల్లడించనున్నారు. బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై వాస్తవాలను బయటపెట్టాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version