వైకుంఠ దర్శనం టోకెన్లు జారీ విషయంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం అని టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ అన్నారు. గతంలో ఇంతకు మించి భక్తులు అధిక సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదు . గతంలో తిరుమల ఘాట్రోడ్లో 36 మంది భక్తులతో బస్సు లోయలో పడింది. అయినా ఒక ప్రాణం కూడా తీసుకోకుండా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర కాపాడారు. గత వైసిపి ప్రభుత్వం లో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా అనుసరిస్తున్న విధివిధానాలను గుడ్డిగా ఇప్పటి అధికారులు, పాలకమండలి పాటించడం పెద్ద తప్పు.
వైకుంఠ ఏకాదశి , ద్వాదశి కాకుండా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా 10 రోజులు చేయడం అపసృతులకు మూలం. గత ఈవో ధర్మారెడ్డి తప్పుడు ఆగమాలతో, సాంప్రదాయాలను పూర్తి విరుద్ధంగా చేయడంతో గత వైసిపి ప్రభుత్వాం తలమునకులై పోయింది. వాటిని గుడ్డిగా నమ్మి పది రోజులు వైకుంఠ ద్వారం తెరవడం ఆగమ సలహాలను పాటించకపోవడం, ఇప్పుడు ప్రభుత్వానికి తీరిన మచ్చగా మిగులుతుందని పలువురు శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోరానికి ముఖ్య కారణం ఫ్రీ దర్శనం నిలిపివేయడం నడకదారి దర్శనాలను నిలిపివేయడంతో తిరుమలలో ఉన్న 32 కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ 32 కంపార్ట్మెంట్లు ఖాళీ లేకుండా భక్తులతో నిండి ఉంటే తిరుపతిలో ఇంత గుంపులు గుంపులుగా భక్తులు ప్రత్యక్షమయ్యేవారు కాదు అని రమణ పేర్కొన్నారు.