BREAKING : ఆస్పత్రిలో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

-

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న రాత్రి ఆయన ఇంట్లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగి గాయమైనట్లు సమాచారం. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు చికిత్స అందిస్తున్నారు.

KCR in hospital, CM Revanth’s key orders

అయితే.. ఈ విషయం పై రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. యశోద ఆస్పత్రి దగ్గర భద్రత పెంచాలని..కేసీఆర్‌ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి.

ఇది ఇలా ఉండగా.. పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్​ను పరామర్శించేందుకు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ఆరోగ్యంపై తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఆయనకు గాయమైందని తెలిసి బాధగా ఉందని.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోదీ ట్వీట్​లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version