కేజీయఫ్ యశ్ కొత్త మూవీ టైటిల్ రిలీజ్.. ‘Toxic’ గ్లింప్స్ అదుర్స్

-

యశ్.. అంటే ఎక్కువ మందికి తెలియదేమో కానీ కేజీయఫ్ యశ్.. రాఖీ భాయ్ అనగానే చిన్నిపిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు. కేజీయఫ్, కేజీయఫ్ 2 సినిమాలతో యశ్ తన ఇమేజ్​నే కాకుండా కన్నడ సినిమా ఇమేజ్​ను ప్రపంచ వ్యాప్తం చేశాడు. ఆ సినిమాలో తన యాటిట్యూడ్.. యాక్టింగ్​తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇప్పటికీ రాఖీ భాయ్ మేనియా నుంచి ప్రేక్షకులు బయటపడలేక పోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ క్యారెక్టర్ ఎంతలా ఇంపాక్ట్ చేసిందో. అయితే ఈ సినిమాల తర్వాత యశ్ ఇప్పటి వరకు తన లేటెస్ట్ సినిమాల అప్డేట్స్ ఇవ్వలేదని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

కానీ తాజాగా యశ్ తన ఫ్యాన్స్​కు క్రేజీ గిఫ్ట్ ఇచ్చాడు. తన లేటెస్ట్ మూవీ టైటిల్​ను ప్రకటించాడు. యశ్ 19గా తెరకెక్కితున్న ఈ సినిమా టైటిల్​ను చిత్రబృందం తాజాగా రివీల్ చేసింది. Toxic టాక్సిక్ అనే పేరుతో వస్తున్న ఈ సినిమాను గీతూ మోహన్​దాస్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ రివీల్ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. యశ్ ఆనిమేటెడ్ రగ్గడ్ లుక్​తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​తో ఈ వీడియో అద్దిరిపోయింది. మరి మీరూ ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version