గోదారికి నీళ్లు తెస్తెనే కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలి : రేవంత్ రెడ్డి

-

తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ బొందలగడ్డ తెలంగాణగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి చంద్రశేఖర్ చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అంటున్నారు. అవువు.. 60వేల బెల్టు షాపులు ఏ రాష్ట్రంలో కూడా లేవు. వైన్ షాపుల టెండర్ పేరుతో రూ.2600 కోట్లను కేసీఆర్ కొల్లగొట్టారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే.. కేసీఆర్ 7,500 కోట్లకు తెగనమ్ముకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఏం చేసిందో నాగార్జున సాగర్ కట్టమీద చర్చిద్దామా అని పేర్కొన్నారు. చరిత్ర తిరిగేసి చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల కోట్లు దిగమింగారు. కామారెడ్డిలో 22 ప్యాకేజీ పనులు ఇంకా పూర్తి కాలేదు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే కేసీఆర్ కామారెడ్డిలో అడుగుపెట్టాలి. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 25లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చాం. కేసీఆర్ కి సూటిగా సవాల్ విసురుతున్న.. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న చోట ఓట్లు అడుగొద్దు.. డబుల్ బెడ్ రూం ఉన్న చోట మేము ఓట్లు అడగమని చెప్పారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version