చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించిన 9.1 మిలియన్ల మంది ప్రజలు

-

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 40 రోజుల అంతరిక్ష యాత్రకు బయలుదేరిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. జూలైలో ప్రారంభించినప్పటి నుండి చివరకు చంద్రునిపై ల్యాండింగ్ అయ్యేంతవరకు ఇస్రో అధికారులు ఎంతో శ్రమించారు.

చంద్రయాన్‌-3 జాబిల్లిపై అడుగుపెట్టినప్పుడు 80,59,688 మందికి పైగా ఆన్‌లైన్‌లో ఆ దృశ్యాలను వీక్షించారు. అయితే.. ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకినప్పుడు 355.6K మందికి పైగా వీక్షించినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ఇస్రో అధికారిక ప్రసార ఛానెల్‌లలో ప్రత్యక్షంగా వీక్షించిన వారితో పాటు, భారతదేశంలోనే కాకుండా దేశాల్లోని అనేక మంది ప్రజలు ఈ చారిత్రాత్మక క్షణాన్ని వీక్షించారు. భారతదేశంలో దూరదర్శన్ టీవీ ఈ ముఖ్యమైన సందర్భాన్ని అధికారికంగా ప్రసారం చేసింది.

టీవీలో దూరదర్శన్ ప్రసారాన్ని ఎంత మంది చూశారో అధికారిక సంఖ్యలు ఇంకా ప్రకటించనప్పటికీ, ఛానెల్ యూట్యూబ్ లింక్‌లో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలాన్ని తాకినప్పుడు 750,822 మందికి పైగా వీక్షిస్తున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version