దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రికి ఈనెల 14న కేసీఆర్ శంకుస్థాపన

-

తెలంగాణ ఆరోగ్య రంగాన్ని దేశంలనే మేటిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కూడా నిర్మిస్తోంది. మరోవైపు ఇప్పుడున్న ఆస్పత్రులను అప్​గ్రేడ్ చేస్తూ.. మరింత మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే నిమ్స్‌ ఆస్పత్రికి అనుబంధంగా అధునాతన ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఎర్రమంజిల్‌లోని ప్రభుత్వ ప్రాంగణంలో 25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించేందుకు రంగం సిద్ధం అవుతోంది. నిమ్స్ ప్రాంగణంలో అవకాశం లేకపోవటంతో నిమ్స్‌కు సమీపంలోని కాలం చెల్లిన ప్రభుత్వ క్వార్టర్ల స్థానంలో ఆసుపత్రి నిర్మాణానికి రహదారులు, భవనాల శాఖ ప్రణాళిక రూపొందించింది. ఆయా క్వార్టర్లను స్వాధీనం చేసుకుని వాటిని కూల్చి వేశారు. ఈ నెల 14న ఆ భవన సముదాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేసేందుకు వీలుగా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version