రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎక్స్ వేదికగా #AskKTR సెషన్ ద్వారా ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకొనే కేటీఆర్.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మళ్లీ అందుబాటులోకి రానున్నారని చెప్పినట్టుగానే స్పందించారు. చాలా రోజుల తర్వాత మరోసారి చిట్ చాట్‌కు సిద్ధమయ్యారు. ఇక కేటీఆర్ తో ముచ్చటించాలనుకునే వారు #AskKTR హాష్ ట్యాగ్ ఉపయోగించి ఈ సెషన్‌లో పాల్గొనండి అంటూ స్వయంగా కేటీఆర్ ప్రకటించారు.
వచ్చే ఏడాది నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని కేటీఆర్ తాజాగా వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్యం, ఆయన బయటకు ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు #AskKTR లో స్పందించారు. ” కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ప్రతిరోజు ఆయన మాకు మార్గనిర్దేశం చేస్తున్నారు. బాద్యతయుతమైన ప్రతిపక్ష నేతగా, 420 హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారు. 2025 నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు. కుదిరితే ఇంకా ముందే దిగుతారు” అంటూ చెప్పారు కేటీఆర్.