తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే, రెండు లేదా మూడు రోజుల్లోనే కల్వకుంట్ల చంద్రశేఖర రావు డిశ్చార్జ్ అవుతారని వైద్యులు చెబుతున్నారు. గత రెండు రోజుల కిందట తన ఫామ్ హౌస్ లో ఉన్న బాత్రూంలో కింద కెసిఆర్.
ఈ నేపథ్యంలోనే ఆయన తొంటి వెనుక తిరిగింది. దీంతో కెసిఆర్ ను వెంటనే యశోద ఆసుపత్రికి ఆయన కుటుంబ సభ్యులు తరలించారు. ఈ తరుణంలోనే తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆపరేషన్ కూడా చేశారు వైద్యులు. ఇక నిన్న వైద్యుల సహాయంతో నడిచారు కేసీఆర్.
ఈ తరుణంలోనే.. హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ని పరామర్శించిన చిన జీయర్ స్వామి…ఆయన త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. మళ్లీ యాక్టివ్ రాజీకీయాల్లోకి రావాలని వెల్లడించారు. కాగా, 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరం అని చెప్పారు డాక్టర్లు.