తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించానని సీఎం కేసీఆర్ వనపర్తి ఆశీర్వాద సభలో మాట్లాడారు. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. దమ్ముంటే నా మీద పోటీ చేయ్ అంటున్నారు. 119 చోట్ల కేసీఆర్ ఒక్కడే ఎలా పోటీ చేస్తాడు. పోటీ చేస్తున్న వాళ్లందరూ లోకల్ గా కేసీఆర్ లే. వలసల వనపర్తిని నేడు వరి పంట్ల వనపర్తిగా చేశామన్నారు. గడిచిన పదేళ్లలో ఏం చేశామన్నది మన కళ్ల ముందే కనిపిస్తోందని చెప్పారు.
గంజి కేంద్రం పెడతామంటే గుంజి కొడతామనే విధంగా పాలమూరును తయారు చేశాం. పాలమూరులో ఎంతో మంది మంత్రులు అయ్యారు.. 5 మెడికల్ కాలేజ్ లు తెచ్చింది మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ మాత్రమే అని చెప్పారు కేసీఆర్. రైతులకు ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఏ సర్కారోడు కానీ రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేదు. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంపై 190 కేసులను కాంగ్రెస్ పార్టీనే వేసింది. తెలంగాణ కావాలని అడిగితే కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.