కల్యాణ లక్ష్మి స్కీంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కల్యాణ లక్ష్మి లబ్దిదారులకు తులం బంగారం తప్పకుండా ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం మా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత, కల్యాణ లక్ష్మి లబ్దిదారులకు తులం బంగారం తప్పకుండా ఇస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటామని పేర్కొన్నారు. ఎవ్వరూ అధైర్య పడకూడదని భరోసానిచ్చారు. పంటలకు మద్దతు ధర కల్పిస్తామని హామి ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న ఆయన డిసెంబర్ నెలాఖరు లోపు రూ.13వేల కోట్ల పెండింగ్ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రైతులందరికీ రుణమాఫీ పూర్తయ్యేంత వరకు విశ్రమించేదే లేదని తెలియజేశారు.