తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రజాపాలన పై క్యాబినెట్ సబ్ కమిటీ

-

ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన హామీల అమలు కోసం ప్రభుత్వం నలుగురితో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను చైర్మన్ గా నియమించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను కమిటీ సభ్యులుగా అపాయింట్ చేసింది.

 

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభయహస్తం పేరిట ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం.. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, వార్డులు, మున్సిపాలిటీలలో డిసెంబర్ 28వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి సాగిన దరఖాస్తుల స్వీకరణలో దాదాపు ఒక కోటి 25 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో అధికారులు లబ్దిదారుల ఎంపిక ప్రాసెస్ చేపట్టారు. లబ్దిదారుల ఫిల్టరింగ్ పూర్తి అయ్యాక.. ఈ పథకానికి అర్హులను గుర్తించి ప్రభుత్వం వారికి అందించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version