BRS ను TRS గా మార్చడంపై కేటీఆర్‌ కీలక ప్రకటన !

-

BRS ను TRS గా మార్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ పేరు మార్పే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడగా…. బీఆర్ఎస్ పేరు మార్పుపై చర్చిస్తున్నామని కేటీఆర్ అన్నారు.

దీంతో బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారనుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇక కేసిఆర్ ను త్వరలోనే సీఎంగా చేసుకుందాం అని కేటీఆర్ అనడం కొత్త చర్చకు తెరతీసింది. కాగా, నేడు ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో BRS పార్లమెంటరీ పార్టీ మీటింగ్ ఉండనుంది. ఉదయం 11 గంటలకు BRS అధినేత కెసిఆర్ అధ్యక్షతన సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, హరీష్ రావు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశం చర్చ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version