హైకోర్టు ఆదేశించినా…హుస్సేన్ సాగర్ లోనే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

-

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆందోళనతో అధికార యంత్రాంగం దిగి వచ్చింది. హుస్సేన్ సాగర్ సహా చెరువులు పిఓపితో వేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు ఆదేశించడంతో అధికారులు నిన్న సాయంత్రం వరకు ఏర్పాట్లు చేయలేదు.

ప్రభుత్వం స్పందించకపోతే తాము నిమజ్జనం చేసి తీరుతామని ఉత్సవ సమితి సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో హుస్సేన్ సాగర్ తీరంలో 13 క్రేన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు. దీంతో హైకోర్టు వద్దన్నా కూడా హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనాలు జరుగుతున్నాయి.

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా….

బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ వరకు సాగే ప్రధాన శోబయాత్ర తో పాటు ఊరేగింపు జరిగే దారులలో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు అనుమతి లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కేశవ గిరి, మహబూబ్నగర్ చౌరస్తా, అశ్రా హాస్పిటల్, సిటీ కాలేజీ వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది. చంచల్గూడా జైలు చౌరస్తా, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్గంజ్ మరియు కోటి ఆంధ్ర బ్యాంకు వద్ద వాహనాలు మళ్లించనున్నారు. మెహదీపట్నం వైపు నుంచి వచ్చే బస్సులను మసాబ్ ట్యాంకు వద్ద, కూకట్పల్లి బస్సులను ఖైరతాబాద్, సికింద్రాబాద్ బస్సులను సిటీవో, ప్లాజా మరియు ఎస్బిహెచ్, క్లాక్ టవర్ వద్ద నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ట్యాంకుబండు వద్ద ఇలాంటి వాహనాలు తిరగడానికి వీలు లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version