ఒక్క డైలాగ్..ఖమ్మం కారు నేతలకు టెన్షన్..పొంగులేటి దెబ్బ.!

-

ఒక్క డైలాగ్..కేవలం ఒకే డైలాగ్..ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బి‌ఆర్‌ఎస్ నేతలని టెన్షన్ పెడుతుంది. ఖమ్మం నుంచి ఒక్క బి‌ఆర్‌ఎస్ నేతని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన డైలాగ్..గులాబీ నేతలని టెన్షన్ పెడుతుందనే చెప్పాలి. లెజెండ్ సినిమాలో బాలయ్య డైలాగుని పొంగులేటి పలకడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు మారిపోయాయి.

2014లో ఖమ్మం వైసీపీ ఎంపీగా గెలిచి..ఆ తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన పొంగులేటికి అక్కడ ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో ఇటీవల పార్టీకి దూరమయ్యారు. ఇక జిల్లాలో తన వర్గాన్ని బలోపేతం చేస్తున్నారు. దీంతో పొంగులేటిని బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఇక దీనిపై పొంగులేటి స్పందిస్తూ..ఖమ్మం నుంచి ఒక్క నాయకుడుని కూడా బి‌ఆర్‌ఎస్ నుంచి గెలవనివ్వను అని, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని ఛాలెంజ్ చేశారు. దీనిపై వరుసపెట్టి ఖమ్మం బి‌ఆర్‌ఎస్ నేతలు స్పందిస్తున్నారు.

అసలు తమని అసెంబ్లీ గేటు తాకనివ్వకుండా ఉండటానికి పొంగులేటి ఎవరని ఫైర్ అవుతున్నారు. జిల్లాలోని మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పొంగులేటి టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు. అయితే విరుచుకుపడుతున్నారంటే పొంగులేటికి భయపడుతున్నట్లే ఉన్నారు. లేదంటే పొంగులేటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆయనకు బలం ఉంది కాబట్టే…ఈ విధంగా పొంగులేటిని టార్గెట్ చేశారు.

అలాగే జిల్లాపై ఆయనకు పట్టు ఉంది..పైగా జిల్లాలో బి‌ఆర్‌ఎస్‌కు బలం తక్కువ. కాంగ్రెస్, కమ్యూనిస్టులకు పట్టు ఎక్కువ. ఈ క్రమంలో ఆయన గాని కాంగ్రెస్ వైపు వెళితే..ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ నేతలకు పెద్ద దెబ్బ తప్పదనే చెప్పాలి. అందుకే పొంగులేటిని నిలువరించడానికి బి‌ఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరి చూడాలి పొంగులేటి వల్ల ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్‌కు ఎంత డ్యామేజ్ జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version