బెంగళూరు చేరిన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి పంచాయితీ

-

తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 17 నియోజకవర్గాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 14 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల అభ్యర్థుల ప్రకటనను పెండింగ్లో ఉంచింది. ఇందులో ఖమ్మం ఒకటి ఫిక్స్ అయితే మిగతా స్థానాలను సులువుగా ప్రకటించేయొచ్చని భావిస్తోంది. కానీ ఖమ్మం పంచాయతీ మాత్రం తెగడం లేదు.

ఈ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పట్టుబడుతున్నారు. కానీ తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఇదే జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ పంచాయితీ కాస్త ఇప్పుడు బెంగళూరు చేరింది.

 

బెంగళూరులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. తొలుత ఇద్దరు నేతలతో విడివిడిగా సమావేశమై చర్చించిన ఖర్గే.. తర్వాత ఇద్దరి నేతలతో అభ్యర్థి ఎంపికపై చరిస్తున్నారు. ఖమ్మం టికెట్ తమ కుటుంబీకుల కోసం పట్టు పడుతున్న ఇద్దరు మంత్రుల.. పోటా పోటీగా ప్రయత్నిస్తున్నారు. ఈ భేటీ తర్వాత ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version