సీతక్కకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే పాతరేస్తామని హెచ్చరించారు ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. మాజీ మంత్రి సీతక్క మెడకు ఇసుక స్కామ్ చుట్టుకున్న సంగతి తెలిసిందే. దింతో సీతక్క పై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలోనే ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు.సీతక్క చాలా బాధ పడుతుందన్నారు.
ఆమెకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే పాతరేస్తామని హెచ్చరించారు. సీతక్క మీద చేస్తున్న ఇసుక అరోపణలు చూసి ఆమె చాలా బాధ పడుతుందని చెప్పారు. ఆమెను చూసి మేము కూడా బాధ పడుతున్నామన్నారు ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. సీతక్క మీద చేసిన ఇసుక అరోపణలు నిరూపించకుంటే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాలన్నారు ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, వెడ్మ బొజ్జు.