kishan reddy:మూసీ నిద్ర కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ చేపట్టిన సంగతి తెలిసిందే. బీజేపీ మూసీ నిద్రలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు పడుకున్నారు. మూసీ పై మూడు నెలల సుదీర్ఘ పోరాటానికి బీజేపీ సిద్ధం అంటూ ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.
నల్లగొండ కు నీళ్ళు ఇవ్వడాన్ని మేం వ్యతిరేకం కాదని..నల్లగొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. పేదల ఇల్లు కూల్చితే మూసీ ప్రక్షాళన జరగదని… కంపెనీల కాలుష్యం రాకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రివర్ బెడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు… కాలుష్యం కాకుండా ఏం చేయాలో తెలియదు.. కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? ఏ విషయంలోనూ సీఎంకు క్లారిటీ లేదని ఆగ్రహించారు.