బోరబండ SRT మార్కెట్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శనివారం ఉదయం బోరబండలోని SRT కూరగాయల మార్కెట్లో ఆకస్మికంగా పర్యటించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనలను ప్రారంభించిన తర్వాత.. అటుగా వెళ్తూ మార్కెట్లోకి వెళ్లారు. కూరగాయల విక్రేతల దగ్గరకు వెళ్లి. అమ్మా టమాట ఎట్లిస్తున్నవ్? అని అడగగానే.. కేంద్రమంత్రిని చూసి ఆశ్చర్యపోయిన ఆ మహిళ.. సర్ 30 రూపాయలకు కిలో అనిచెప్పింది.కిలో టమాటో కొని.. డిజిటల్ పేమెంట్ కోసం అడగగా.. ఆ మహిళ స్కానర్ ఇచ్చింది.

kishan reddy in Borabanda SRT market

తన ఫోన్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేసిన కేంద్రమంత్రి.. పరిస్థితులు ఎలా ఉన్నాయి? గిట్టుబాటు అవుతోందా? ఏమైనా ఇబ్బందులున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.అలాగే ఇతర దుకాణదారులతోనూ కేంద్రమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా దుకాణదారులు మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే రేట్లు తగ్గాయని తెలిపారు. మొన్నటివరకు రూ.70 ఉన్న కిలో టమాట ధర.. ఇప్పుడు రూ.30-40 దగ్గరగా ఉందన్నారు.ప్రభుత్వ ఖాళీ స్థలం లో ఉన్న వెజిటేబుల్ మార్కెట్ ను గత ప్రభుత్వం రోడ్ మీదకు తీసుకోచ్చిందని స్థానిక నాయకులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వివరాలను అడిగి తెలుసుకున్న కిషన్ రెడ్డి.. దీనిపై అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news