హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది – కిషన్ రెడ్డి

-

యూసుఫ్ గూడా ముంపు కాలనీలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని.. పూడిక తీయని కారణంగా రోడ్లపై డ్రైనేజీ పారుతుందని వెల్లడించారు. స్ట్రాం వాటర్ వెళ్ళే కాల్వలు మూసుకుపోయాయని.. హైదరాబాద్ బస్తీల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిధుల కొరతతో సివరేజీ బోర్డ్ ఇబ్బంది పడుతుందని.. సీల్టు తీసే కాంట్రాక్టర్ల కు బిల్లు లు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహించారు. ఇస్తాంబుల్, డల్లాస్ చేస్తామని సిఎం కేసీఆర్ చెప్పారు..ఇప్పుడు భారీ వర్షాలతో జనం ఇబ్బంది పడుతున్నారని ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వ పెద్దలు హై టెక్ సిటీ, మాదాపూర్ కే ఖర్చు చేస్తున్నారని.. నిజమైన హైదరాబాద్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహించారు. మాటలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదని.. బీజేపీ కార్యకర్తలు… ప్రభుత్వ అధికారులతో కలిసి స్వచ్ఛ0దంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు కిషన్ రెడ్డి. రాజకీయం చేయడం లేదు.. నిర్మాణాత్మక మైన సలహాలు ఇస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version