గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు: కిషన్‌రెడ్డి

-

రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై స్పందించిన కిషన్ రెడ్డి మొత్తం మీద ఈ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా తప్పించుకునేలా కనబడుతోందని మండిపడ్డారు. ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన దారుణ మోసంగా పేర్కొన్నారు.

గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారు తప్ప.. వారిచ్చిన ఎన్నికల వాగ్దానాల కోసం చెప్పిందేమీ లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే… కాంగ్రెస్ పాలన అంకెల గారడీతోపాటు మాటల గారడీ అని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఆర్భాటంగా ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’ కోసం ఎక్కడా నిధులు కేటాయించలేదని.. విద్యారంగం గురించి చెప్పిన అంశాలన్నీ నీటిమీద రాతలేనని స్పష్టమైందనికిషన్ రెడ్డి అన్నారు. అసలు బడ్జెట్ ప్రసంగంలో యూనివర్సిటీల ఊసేలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version