రైతుల ఆలోచనలకు అనుగుణంగా పని చేసే ప్రభుత్వం కాంగ్రెస్అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో గురువారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొమటిరెడ్డి ప్రసంగించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దేశానికి మోడల్గా ఉండే మార్కెట్ ని నిర్మించబోతున్నామని అన్నారు.
కోహెడ ప్రాంతంలో రూ.2 వేల కోట్ల వ్యయంతో 2 ఎకరాల్లో ఆధునాతన హంగులతో ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గంలో నిర్ణయం చేయడం జరిగిందని వివరించారు. సీఎంతో పాటు మరికోద్ది మంది పెద్దలతో మార్కెట పనుల శంకు స్థాపన జరగనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.