Kolan Shankar Reddy Auctioned Balapur Laddu: బాలాపూర్ గణేష్ లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. అందరూ అనుకున్నట్లుగానే 30 లక్షలు దాటిపోయింది బాలాపూర్ గణేష్ లడ్డు ధర. ఏకంగా 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు… ఈ లడ్డును కొనుగోలు చేశారు. ఈ బాలాపూర్ లడ్డూను కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేయడం జరిగింది.
మాజీ సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నటువంటి కొలను శంకర్ రెడ్డి… ముందుగానే 30 లక్షల వరకు లడ్డు కొనుగోలు… ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నారు కొలను శంకర్. గతంలో 27 లక్షలకే ఈ లడ్డు వేలం పాటలో కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టారు కొలను శంకర్. అయితే… ఈ శంకర్ రెడ్డి అనే వ్యక్తి బిజెపి పార్టీకి చెందిన వాడుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా… బిజెపి లోనే కొనసాగుతున్నారు. ఈయనది కూడా బాలాపూర్ ప్రాంతమే కావడం విశేషం. అంటే లోకల్ వ్యక్తి బాలాపూర్ లడ్డు కొనుగోలు చేశారు.